Athi Parishuddhudaa Christian song Lyrics in telugu

 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును


నీవు నా పక్షమై నను దీవించగా


నీవు నా తోడువై నను నడిపించగా


జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా   


1. సర్వోన్నతమైన స్థలముల యందు – నీ మహిమ వివరింపగా


     ఉన్నతమైన నీ సంకల్పము – ఎన్నడూ ఆశ్చర్యమే


     ముందెన్నడూ చవి చూడని – సరిక్రొత్తదైన ప్రేమా మృతం


     నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణము తీరదు ఏనాటికీ


2. సద్గుణ రాశి నీ జాడలను – నా ఎదుటే నుంచుకొని


     గడిచిన కాలం సాగిన పయనం – నీ కృపకు సంకేతమే


     కృప వెంబడి కృప పొందగా – మారాను మధురముగా నే పొందగా


     నాలోన ఏ మంచి చూశావయ్యా – నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా 


3. సారెపై నున్న పాత్రగ నన్ను – చేజారి పోనియ్యక 


     శోధనలెన్నో ఎదిరించినను – నను సోలి పోనియ్యక 


     ఉన్నావులే ప్రతి క్షణమునా – కలిసున్నావులే ప్రతి అడుగునా 


     నీవేగా యేసయ్య నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి        

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...