వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

 వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా

వదనంబు లందు కో ప్రభో


1. ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు

గన్న తండ్రి మించి యెపుడు గాచియు

ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా

యన్ని రెట్లు స్తోత్రము లివిగో “వందనం”


2. ప్రాత వత్సరంపు బాప మంతయు

బ్రీతిని మన్నించి మమ్ము గావుము

నూత నాబ్దమనను నీదు నీతి నొసగు మా

దాత క్రీస్తు నాధ రక్షకా “వందనం”


3. దేవ మాదు కాలుసేతు లెల్లను

సేవకాళి తనువు దినము లన్నియు

నీవొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ

సేవకై యంగీకరించుమా “వందనం”


4. కోతకొరకు దాసజనము నంపుము

ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము

ఖ్యాతి నొందు నీతి సూర్యుడా “వందనం”


5. మా సభలను పెద్దజేసి పెంచుము

నీ సువార్త జెప్ప శక్తి నీయుము

మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము

యేసు కృపన్ గుమ్మరించుము “వందనం”

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...