Andaala Thaara Arudenche Naakai

 అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్

ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో

ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||


విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను

వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున

విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో

విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||


యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు

ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి

యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో

ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు ||అందాల తార||


ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే

బాలుని జూడ జీవితమంత పావనమాయెను

ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము

బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన ||అందాల తార||

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...