Anjali Ghatiyinthu Devaa


అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి||

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ (2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా ||అంజలి||

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ (2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా ||అంజలి||

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...