Naa Manassaa Aayana Marachunaa


నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2)
తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే||

సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో – అలంకరించునే…

విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...