దైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా ||దైవ||
పాపులకై వచ్చినావా
పాపులను కరుణించినావా (2)
ప్రాణదానము చేసినావా – దేవా
పరలోకము తెరచినావా ||దేవుడే||
కల్వరిలో కార్చినట్టి
దివ్యరక్తముచే మమ్ము (2)
కడిగి పావన పరచినావా – దేవా
కడుగు బూరతో రానై యున్నావా ||దేవుడే||
మరణము జయించినావా
మరణముల్లు విరచినావా (2)
మహిమతోడ లేచినావా – దేవా
మాదు చింతలు దీర్చినావా ||దేవుడే||
ధరణిలో అతి దుష్టులముగా
దారి తెలియక దూరమైతిమి (2)
ధరణికే ఏతెంచినావా – దేవా
ధన్యులనుగా జేసినావా ||దేవుడే||
ఆదియంతము లేనివాడా
అందరికిని దేవుడవు (2)
అల్ఫయు ఓమేగయు నీవేగా – యేసు
ఆర్భటించుచు రానై యున్నావా ||దేవుడే||
No comments:
Post a Comment