Nedu Yesu Lechinaadu

 నేడు యేసు లేచినాడు

నేడు యేసు లేచినాడు

మనమానందము నొందుదాము (2) ||నేడు||

పరలోకము నుండి దూతలు

దిగి వచ్చిరి సమాధికి (2)

భద్రముగా చేసిరిగా

బహు భద్రముగా చేసిరిగా ||నేడు||


మగ్దలేనే మరియ వేరొక మరియ

సుగంధ తైలము తెచ్చుకొని (2)

పూయుటకు వెళ్లిరిగా

బహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు||


వేకువ జామున యేసు ప్రభుండు

తోటలో సంచరింపంగ (2)

తోటమాలి అనుకొనెను

బహు తోటమాలి అనుకొనెను ||నేడు||


నేను ఇంకను తండ్రి యొద్దకు

త్వరగా వెళ్లిపోలేదు (2)

కనుక నన్ను ముట్టవద్దు

మరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...