Neevu Thodaiyundagaa Yesu

 నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో

మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో

ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ

లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా||


గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా

శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా

పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి

నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా||


ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా

యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా

వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి

నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా||


నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా

నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...