New songs Lyrics Ninnu Vembadincheda

నిన్ను వెంబడించెద

నీ కాడి మోయుదున్

నీదు పాదముల చెంత

నే నేర్చుకొందును (2)

మాదిరి నీవే – నెమ్మది నీవే

దీనుడవు యేసయ్యా (2) ||నిన్ను||


పాపాంధకారం లో నుండి

రక్షించి వెలిగించితివి (2)

పరిశుద్ధమైన పిలుపుతో

నీ వెంబడి రమ్మంటివి (2)

నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను||


లోకాశలన్ని నీ కోసం

నేనింక ఆశించను (2)

లోపంబులేని ప్రేమతో

నీ కోసం జీవింతును (2)

నీ కోసం జీవింతును ||నిన్ను||


పవిత్రపరచుకొందును

అర్పించు కొందును (2)

కష్టాలు శ్రమలు రేగినా

నిను వీడిపోనయ్యా (2)

నిను వీడిపోనయ్యా ||నిన్ను||


ప్రేమ సువార్త ప్రకటింప

భారంబు మోపితివి (2)

సత్యమార్గంబు చాటగ

పంపుము నా ప్రభువా (2)

పంపుము నా ప్రభువా ||నిన్ను|| 


No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...