Nyaayaadhipathi Aina Devudu

న్యాయాధిపతి అయిన దేవుడు

నిను తీర్పు తీర్చేటి వేళలో

ఏ గుంపులో నీవుందువో

యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి||


ఆకలితో అలమటించగా

దాహముతో తపియించగా (2)

రోగముతో కృశియించగా (2)

నను చేర్చుకొనలేదు నీవెందుకు

అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి||


గ్రహియించుకో నీదు గమ్యము

విడనాడు పాప గతమును (2)

లేదింక నీకు తరుణము (2)

ప్రభునాశ్రయించుటే బహు క్షేమము

ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి|| 

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...