Vaati Vaati Kaalamuna Annitini Athi Manoharamugaa Cheyuvaadaa

 వాటి వాటి కాలమున అన్నిటిని

అతి మనోహరముగా చేయువాడా (2)

యేసయ్యా.. యేసయ్యా..

నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి||

ఆశ భంగం కానేరదు

మంచి రోజు ముందున్నది (2)

సత్క్రియను ఆరంభించెను

ఎటులైన చేసి ముగించును (2)

(నే) రూఢిగా నమ్ముచున్నాను

ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా||


అద్భుతములు చేసెదను

నీ తోడుంటానంటివి (2)

నా ప్రజల ఎదుట నీవు

(నను) హెచ్చింప చేసెదవు (2)

(నే) రూఢిగా నమ్ముచున్నాను

హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా||


ఇప్పుడున్న వాటి కంటే

వెయ్యి రెట్లు చేసెదవు (2)

ఆకాశ తార వలె

భువిలో ప్రకాశింతును (2)

(నే) రూఢిగా నమ్ముచున్నాను

భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా||

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...