మన పాపాలు ఒప్పుకోవటం అనేది దేనిని సూచిస్తుంది?
1. మనము పాపులము అని అంగీకరించుటను సూచిస్తుంది.
2. మనం పాపం చేయడానికి అపవాదియొక్క అబద్దాలు సహాయ పడ్డాయి. అని పరోక్షంగా దేవుని ఎదుట ఒప్పుకోవటమును సూచిస్తుంది.
3. ఆయన యొక్క సత్యాన్ని తెలుసుకొని, ఇక మీదట ఎటువంటి పాపము చేయకుండా కాపాడమని పరోక్షంగా ఆయనను అడుగుటను సూచిస్తుంది.
మన పాపములను మనం ఒప్పుకున్నప్పటికీ, దేవుని జవాబు కొరకు మనం ఎదురు చూడాలి. దీని అర్ధం ఏమనగా మన పాపములను క్షమించుటకు దేవునికి కొంతసమయం ఇవ్వాలి. దేవుడు మనలను క్షమించాడు అనుదానికి ఋజువుగా ఏదో ఒక సూచన ద్వారా దాన్ని బయలుపరుస్తాడు. అంతేకాక దేవుని సమాధానం మన హృదయాల్లో అనుభవించగల్గుతాం. ఒకవేళ మన పాపములు క్షమించబడక పోయినట్లయితే, దానిని కూడా మన హృదయ స్పందనను బట్టి తెలుసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో సాతాను మనలో అపరాధ భావమును కల్గించుటకుగానీ, నిందించుటకు గానీ అవకాశమును ఏ మాత్రమూ ఇవ్వకూడదు. ఒకవేళ మనలో వున్న పాపం అనేది వంశ పారంపర్యమైన శాపమునకు సంబంధించినదైనప్పటికీ, దేవుడు దాన్ని క్షమించాడా? క్షమించలేదా? అనే నిశ్చయితను కల్గిస్తాడు. మనలోని పాపములు క్షమించబడినవా? క్షమించబడలేదా? అనే దాన్ని అర్ధం చేసుకొనుటకు పరిశు ద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు.
ఒప్పుకోలు ప్రార్ధన ద్వారా మనం పొందుకొనే ఆశీర్వాదాలు ఏమిటి?
1. అపరాధ భావము నుండి విడుదల పొందుతాం.
2. దేవుని దృష్టిలో కృప పొందినవారము అవుతాము.
3. దేవుని నడిపింపుగలవారముగా ఉంటాము.
4. అపరిమితమైన ఆనందమును అనుభవించువారంగా ఉంటాం.
5. మన హృదయాల్లో దేవుడిచ్చే సంపూర్ణ శాంతి సమాధానములను అనుభవిస్తాం.
ఆయన క్షమించేతత్వం ద్వారా ఆయన ప్రేమను రుచి చూడటానికి ప్రభువు మీకు సహాయం చేయునుగాక !.. ఆమేన్ !..
No comments:
Post a Comment