1. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా
(ఆది 1:2) మీకు స్తోత్రములు
2. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తయైన దేవా
(ఆది 1:2) మీకు స్తోత్రములు
3. నోటిమాటచేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్తయైన దేవా (ఆది 1:8-10)
- మీకు స్తోత్రములు
4. నోటిమాటచేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన
సృష్టికర్తయైన దేవా (ఆది 1:14-16) మీకు స్తోత్రములు
5. నోటిమాటచేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా (ఆది 1:20-25) మీకు స్తోత్రములు
6. నోటిమాటచేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్తయైన
దేవా (ఆది 1:12) మీకు స్తోత్రములు
7. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు, మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తయైన దేవా
(ఆది 2:7) మీకు స్తోత్రములు
స్తుతులలో ఉన్న ఆశీర్వాదం
8. రాజాధిరాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా (1తిమోతి 6:15) మీకు స్తోత్రములు
9. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షనీయుడా (పరమ 5:10,16) మీకు స్తోత్రములు
10. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6) మీకు స్తోత్రములు
11. పరిశుద్దమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన
నామము గల దేవా (కీర్తన 111:9) మీకు స్తోత్రములు
12. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతినొందదగిన నామము గల దేవా (కీర్తన 113:3)
మీకు స్తోత్రములు
13. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా
(ఫిలిప్పీ 2:11) మీకు స్తోత్రములు
14. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడైయున్న దేవా
(కీర్తన 47:8) మీకు స్తోత్రములు
15. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా (మత్తయి 5:34) మీకు స్తోత్రములు
16. సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతలచేత కొనియాడబడుచున్న
దేవా (యెషమా 6:3) మీకు స్తోత్రములు
17. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా (1 తిమోతి 6:16) మీకు స్తోత్రములు
18. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా జరుగును అని చెప్పిన దేవా (జెకర్యా 4:7) ఆత్మచేతనే కార్యము
మీకు స్తోత్రములు
19. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా (యిర్మీయా 9:24)
మీకు స్తోత్రములు
20. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైన కలదా? అని చెప్పిన దేవా (యిర్మీయా 32:27)
మీకు స్తోత్రములు
21. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా
(హెబ్రీ 13:8) మీకు స్తోత్రములు
22. మారని వాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా (కీర్తన 146:6) మీకు స్తోత్రములు
23. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా ( కీర్తన 50:15)
మీకు స్తోత్రములు
24. నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా
(కీర్తన 55:22) మీకు స్తోత్రములు
25. నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తును సఫల పరచుదును అని చెప్పిన దేవా
(కీర్తన 20:4) మీకు స్తోత్రములు
26. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా
( 31:3 ) మీకు స్తోత్రములు
27. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా
(కీర్తన 118:8,9) మీకు స్తోత్రములు
28. నన్ను ప్రేమించువారిని ఆస్థికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా
(సామెతలు 8:21) మీకు స్తోత్రములు
29. నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా
(కీర్తన 32:8) మీకు స్తోత్రములు
30. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను అని చెప్పిన దేవా
(యెషయా 49:25) మీకు స్తోత్రములు
31. నేను మీతో కూడా నివసించుదును. మీలో ఉందును అని చెప్పినదేవా
(యోహాను 14:17) మీకు స్తోత్రములు
32. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా
(కీర్తన 113:8)
- మీకు స్తోత్రములు
33. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని
ఆదుకొనువాడా (కీర్తన 146:9) మీకు స్తోత్రములు
34. ఇశ్రాయేలీయుల మొర ఆలకించి, వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా
(నిర్గమ 2:23) మీకు స్తోత్రములు
35. ఎర్రసముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలమీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా
(నిర్గమ 14:21,22) మీకు స్తోత్రములు
36. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించిన దేవా (కీర్తన 78:24) మీకు స్తోత్రములు
37. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చిన
దేవా (సంఖ్యా 20:11) మీకు స్తోత్రములు
38. పగలు మేఘ స్థంభమై, రాత్రి అగ్ని స్థంభమై ఇశ్రాయేలీయులను
నడిపించిన దేవా (నిర్గమ 13:21) మీకు స్తోత్రములు
39. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో కోట గోడ కూల్చివేసిన దేవా (యెహోషువ 6:20) మీకు స్తోత్రములు
40. ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా
(ద్వితీయోప 29:5) మీకు స్తోత్రములు
41. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా
(యెహోషువ 14:1) మీకు స్తోత్రములు
42. నోవహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించిన దేవా (అది 15,16) మీకు స్తోత్రములు
43. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి
ప్రధానిగా చేసిన దేవా (అది 41:41) మీకు స్తోత్రములు
44. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత
చక్రవర్తిగా హెచ్చించిన దేవా (2సమూ 5:3) మీకు స్తోత్రములు
45. యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా
- మీకు స్తోత్రములు
46. యెహెజ్కేలు ప్రార్ధించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన
దేవా (యెహెజ్యేలు 37:5) మీకు స్తోత్రములు
47. హిజ్కియా ప్రార్ధించగా ఆయుష్యు పొడిగించిన దేవా
(చాకేవ్ 38:56) మీకు స్తోత్రములు
48. ఏలీయా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా
(1వ సంవత్సరము 18:38) మీకు స్తోత్రములు
49. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని
రక్షించిన దేవా (దానియేలు 622) మీకు స్తోత్రములు
50. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించినదేవా (దానియేలు 3:26) మీకు స్తోత్రములు
51. ఎలుగుబంటిని, సింహాన్ని చంపటానికి దావీదుకి శక్తినిచ్చిన
దేవా (1 సమూయేలు 17:36) మీకు స్తోత్రములు
52. హనోకు, ఏలీయాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకు వెళ్ళిన దేవా (అది 5:24, 2 రాజులు 2:11)
-మీకు స్తోత్రములు
53. తల్లిదండ్రులు లేని, అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా (ఎస్తేరు 2:7,17)
- మీకు స్తోత్రములు
54. అన్యురాలు, విధవరాలైన రూతును ఆదుకొని, ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా
(మత్తయి 1:5) మీకు స్తోత్రములు
55. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన
(యెహోవా 21:2) మీకు స్తోత్రములు
56. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, రిక్తునిగా చేసుకొన్న యేసయ్యా
(ఫిలిప్పీ 2:6,7) మీకు స్తోత్రములు
57. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా
(మత్తయి 1:23) మీకు స్తోత్రములు
58. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా
మీకు స్తోత్రములు
59. లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొట్టెపిల్ల
( 1:29 )
-మీకు స్తోత్రములు
60. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా (మత్తయి 11:28)
- మీకు స్తోత్రములు
61. కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్యా
(యోహాను 2:7-9) మీకు స్తోత్రములు
62. ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేలమందికి పంచిపెట్టిన యేసయ్యా
(మత్తయి 14:19-21) మీకు స్తోత్రములు
63. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా
(మత్తయి 8:17) మీకు స్తోత్రములు
64. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా
(మత్తయి 21:14) మీకు స్తోత్రములు
65. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా
(మార్కు 7:33-35) మీకు స్తోత్రములు
66. గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా
(మత్తయి 15:30) మీకు స్తోత్రములు
67. కుష్టురోగులను బాగుచేసిన యేసయ్యా
(లూకా 17:11-14) మీకు స్తోత్రములు
68. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగుచేసిన యేసయ్యా
(మత్తయి 8:13) మీకు స్తోత్రములు
69. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగుచేసిన యేసయ్యా
(మార్కు 5:25-29 ) మీకు స్తోత్రములు
70. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగుచేసిన
యేసయ్యా (లూకా 13:11-13) మీకు స్తోత్రములు
71. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగుచేసిన
యేసయ్యా (యోహాను 5:5-9)
-మీకు స్తోత్రములు
72. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా
(5 8:54,55)
-మీకు స్తోత్రములు
73. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన
యేసయ్యా (లూకా 7:11-15)
-మీకు స్తోత్రములు
74. చనిపోయిన లాజరును నాలుగు రోజుల తర్వాత సమాధి
నుండి లేపిన యేసయ్యా (యోహాను 11:43,44)
మీకు స్తోత్రములు
75. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా
( 53:5 )
- మీకు స్తోత్రములు
76. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న
యేసయ్యా (యెషయా 53:5)
మీకు స్తోత్రములు
77. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా (అపొ.కా. 20:28)
- మీకు స్తోత్రములు
78. మా దరిద్రతను కొట్టివేసి, మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా (2 కొరింథీ 8:9)
మీకు స్తోత్రములు
79. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి, మమ్మల్ని ఆశీర్వదించ డానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా
(గలతీ 3:13,14) మీకు స్తోత్రములు
80. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన యేసయ్యా
(హెబ్రీ 9:28) - మీకు స్తోత్రములు
81. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి, మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా (మార్కు 15:44)
- మీకు స్తోత్రములు
82. సమాధిని గెలిచి, మరణపు ముల్లును విరిచి, మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్యా (లూకా 24:5,6)
-మీకు స్తోత్రములు
83. యేసు రక్తము ద్వారా ప్రతి పాపమునుండి మమ్మల్ని పవిత్ర
పరుస్తున్న దేవా (1 యోహాను 1:7)
- మీకు స్తోత్రములు
84. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా
(2యేసు 1:7)
- మీకు స్తోత్రములు
85. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా
( 9:14 ) మీకు స్తోత్రములు
86. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా
మార్చిన దేవా (రోమా 5:9)
- మీకు స్తోత్రములు
87. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా ,
( లూకా 10:19) మీకు స్తోత్రములు
88. అపవాది తలను శిలువలో చితకద్రొక్కిన యేసయ్యా
(అది 3:15) మీకు స్తోత్రములు
89. సాతానును మా కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న
యేసయ్యా (రోమా 16:20) మీకు స్తోత్రములు
90. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా
(మత్తయి 4:16) మీకు స్తోత్రములు
91. మీ సిలువ మరణం చేత అపవాదిని, వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి, మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా (కొలస్సీ 2:15)
-మీకు స్తోత్రములు
92. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవా
( యోహాను 16:8 ) మీకు స్తోత్రములు
93. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా
(యోహాను 16:13) మీకు స్తోత్రములు
94. సంభవింపబోవు సంగతులను మాకు పరిశుద్ధాత్మ దేవా (యోహాను 16:13) తెలియజేయుచున్న
- మీకు స్తోత్రములు
95. ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన
చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా (రోమా 8:26)
- మీకు స్తోత్రములు
96. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా
( 14:26 ) మీకు స్తోత్రములు
97. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న
యేసయ్యా (రోమా 8:34) మీకు స్తోత్రములు
98. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న
యేసయ్యా (యోహాను 14:2) మీకు స్తోత్రములు
99. ముత్యపు గుమ్మాలు కలిగి, బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోవుచున్న యేసయ్యా
(జాన్ 21:21) మీకు స్తోత్రములు
100. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్లుటకు త్వరలో రాబోవుచున్న
యేసయ్యా (ప్రకటన 22:12) మీకు స్తోత్రములు
No comments:
Post a Comment