Doorapu Kondapai Shramalaku Gurthagu

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు

కౄరపు సిలువయే కనబడె

పాపలోకమునకై ప్రాణము నొసగిన

ప్రభుని సిలువను ప్రేమింతున్


ప్రియుని సిలువను ప్రేమింతున్

ప్రాణమున్నంత వరకును

హత్తుకొనెదను సిలువను

నిత్యకిరీటము పొందెదన్


లోకులు హేళన చేసిన సిలువ

నా కెంతో అమూల్యమైనది

కల్వరిగిరికి సిలువను మోయను

క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని||


రక్తశిక్తమైన కల్వరి సిలువలో

సౌందర్యంబును నే గాంచితిని

నన్ను క్షమించను పెన్నుగ యేసుడు

ఎన్నదగిన శ్రమ పొందెను ||ప్రియుని||


వందనస్తుడను యేసుని సిలువకు

నిందను ఈ భువిన్ భరింతు

పరమ గృహమునకు పిలిచెడు దినమున

ప్రభుని మహిమను పొందెద ||ప్రియుని|| 

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...