Prabhu Yesu.. Prabhu Yesu – Adigo Shrama Nondenu

ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను

ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు ||


ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా

అంతగా బాధించి సిలువమీది కెత్తిరి

బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||


ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి

మూర్ఖుల దెబ్బల బాధను సహించెను

మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||


ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో

సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి

సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||


మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను

మూడవనాడు సమాధినుండి లేచెను

విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||


తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు

దేవయని ప్రభు అరచిన యపుడు

దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభుయేసు ||


కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని

నీకువేరుగా నారక్షణిల లేదుగా

నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు

ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || 

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...