New songs Lyrics Jeevinthu Nenu Ika Meedata

 జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు

యేసు కొరకే జీవింతును (2)

నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే

నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే

జీవింతును జీవింతును

జీవింతును జీవింతును (2) ||జీవింతు||


నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే

బహుమానము పొందగ పరుగిడుదున్

వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి

కొరకే నే వేగిరపడుదును (2)

నన్ను ప్రేమించిన యేసుని చూతును

నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును

గురి వైపుకే – పరుగెడుదును

వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు||


శ్రమయైనా బాధైననూ – హింసయైనా

కరువైనా ఎదురైననూ

ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా

ఎతైనా లోతైననూ (2)

నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి

నేను విడిపోదునా ప్రభు నీడనుండి

జీవింతును – నా యేసుతో

జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...