New songs Lyrics Sundaramulu Athi Sundaramulu

 సుందరములు అతి సుందరములు

సువార్త మోసిన పాదములు

అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు

ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)

ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు

ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2)

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు

జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)

తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు

ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి||


లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు

తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2)

తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు

తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2) ||ఏ లేమికి||

No comments:

Post a Comment

Aakaashamandu Christian songs Lyrics in telugu

Song name : Aakaashamandu Neevundagaa Lyricist: Songs of Zion  ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడ...