Paapiga Nanu Choodaleka Christian song Lyrics in telugu

పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా

దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2)

నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే

అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే

తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే

జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే


నీవే నీవే – నీవే దేవా

నీవే నీవే – నా యేసయ్యా (2)


పరమును వీడి ఈ భువికి

దిగి వచ్చిన రక్షకుడా

మహిమను వీడి నా వెలని

చెల్లించిన ప్రేమామయుడా


నే వెదకి రాలేనని సత్యమునెరిగి

నీవే నా దరికి పరుగెత్తితివి

దాసత్వము నుండి నను విడిపించి

తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే||


నా స్థానములో నీవే నిలిచి

నీ స్థానమే నాకిచ్చితివి

సౌందర్యవంతునిగా నన్నే చేసి

సొగసంతా కోల్పోయితివి


నీ బలమంతా నాకే ఇచ్చి

బలియాగముగా నీవు మారితివి

ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి

దీనతనే హత్తుకొంటివి ||నీవే||


నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే

నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే

నా అతిశయము నీవే – నా ఆనందం నీవే

నా ఆధారం నీవే – నీవే నీవే (2)


యేసయ్యా యేసయ్యా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||పాపిగ|| 

No comments:

Post a Comment

Telugu Baibul Genesis Chapter 5

  Genesis(ఆదికాండము) 5 1.ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;  2.మగవానిగాను ఆడుదానిగాను వ...